Proddatur: ప్రొద్దుటూరు 38వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవమైన జింక కళావతి!
Proddatur: ప్రొద్దుటూరు 38వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవమైన జింక కళావతి, ఆమె భర్త, టీడీపీ నాయకులు శ్రీనివాసులరెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
Proddatur: ప్రొద్దుటూరు 38వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవమైన జింక కళావతి!
Proddatur: ప్రొద్దుటూరు మునిసిపల్ 38వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జింక కళావతి, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
-ఈ సందర్భంగా ఆమె వారి భర్త జింక రామకృష్ణ శ్రీనివాసులరెడ్డిని శాలువాతో సత్కరించి, తన ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ వెంకటలక్ష్మి, ఆమె భర్త జింక రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి కి మంచి పేరు వచ్చేలా మీరందరూ కలిసి పని చేయాలని కోరారు.




