Rayachoti: కేవీ పల్లి మండలంలో పిడుగుపాటుకు గురై మూగజీవాల మృతి!

Rayachoti: కేవీ పల్లి మండలం పెద్దకంబి రెడ్డిగారిపల్లిలో పిడుగుపాటుకు గురై 3 మేకలు, 2 గొర్రెలు మృతి చెందాయని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Oct 2026 3:54 PM IST
Rayachoti
X

Rayachoti: కేవీ పల్లి మండలంలో పిడుగుపాటుకు గురై మూగజీవాల మృతి!

Rayachoti: కేవీ పల్లి మండలం నూతనకాలువ గ్రామం పెద్దకంబి రెడ్డిగారిపల్లి లో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ దర్బార్ భాషకు చెందిన 3 మేకలు, 2 గొర్రెలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబానికి సుమారు లక్ష రూపాయలు ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి పిడుగుపాటు ఘటనలో మృతి చెందిన మూగ జీవాలకు పరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI