Proddatur: పర్లపాడు సర్పంచ్‌గా ఎంబీఏ గ్రాడ్యుయేట్ తోట సాహితి ఏకగ్రీవ ఎన్నిక!
Proddatur : ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం పర్లపాడు సర్పంచ్‌గా ఎంబీఏ పట్టభద్రురాలు తోట సాహితి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Proddatur: పర్లపాడు సర్పంచ్‌గా ఎంబీఏ గ్రాడ్యుయేట్ తోట సాహితి ఏకగ్రీవ ఎన్నిక!
Proddatur : ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి మూడో తరం వారసురాలు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యావంతురాలైన యువతి గ్రామ పాలనలోకి రావడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాజుపాలెం మండలం పరిధిలోని పర్లపాడు గ్రామం మరోసారి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. మాజీ జెడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి కుటుంబం నుంచి వరుసగా మూడో తరం వారసురాలిగా తోట సాహితి సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంబీఏ (MBA) పూర్తి చేసిన తోట సాహితి.. ఉన్నత చదువులతో పాటు రాజకీయాలపై ఆసక్తి, నూతన ఉత్సాహంతో గ్రామ సేవకు ముందుకొచ్చారు. పర్లపాడు గ్రామ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి, సహకారంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఈ కుటుంబానికి పర్లపాడు గ్రామ రాజకీయాలతో దశాబ్దాల అనుబంధం ఉంది. ముందుగా తోట సాహితి తాత తోట జయరామిరెడ్డి పర్లపాడు గ్రామం నుంచి సర్పంచ్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత ఆమె తండ్రి తోట మహేశ్వరరెడ్డి రాజుపాలెం మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ, మూడో తరం ప్రతినిధిగా తోట సాహితి పర్లపాడు సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా తోట సాహితి హర్షం వ్యక్తం చేశారు. తనతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే తనపై నమ్మకం ఉంచి, ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మరియు పర్లపాడు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.




