Duvvuru: దువ్వూరులో ఉద్రిక్తత.. వైకాపా నేతల హౌస్ అరెస్ట్!
Duvvuru: దువ్వూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది శాంతిభద్రతల దృష్ట్యా పలువురు వైకాపా ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
Duvvuru: దువ్వూరులో ఉద్రిక్తత.. వైకాపా నేతల హౌస్ అరెస్ట్!
Duvvuru: మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు గ్రామాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, అనంతరం స్థానిక దువ్వూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్‌కు తరలించిన వారిలో చింతకుంట గ్రామానికి చెందిన పార్టీ నాయకులు కోగటం వీరారెడ్డి, ఎల్. వీరశేఖర్ రెడ్డి, గుడిపాడు గ్రామానికి చెందిన తుమ్మల చిన్నా (వెంకటరెడ్డి), అలాగే కృష్ణం పల్లి గ్రామానికి చెందిన యం. విజయ్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు.
నామినేషన్ల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.




