Kadapa: జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత: కార్ల ధ్వంసం!
Kadapa: జమ్మలమడుగు మున్సిపల్ ప్రచారం చివరి రోజు వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి హైమావతి వాహనాలు ధ్వంసం కావడం తీవ్ర ఉద్రిక్తతకు, నిరసనలకు దారితీసింది.
Kadapa: జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత: కార్ల ధ్వంసం!
Kadapa: మున్సిపల్ ఎన్నికల సందర్భముగా ప్రచారం చివరి రోజున కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి హైమావతికి చెందిన వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వల్ల ఉద్రిక్తత తీవ్ర స్థాయికి చేరింది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో శుక్రవారం వైఎస్ఆర్సిపి చైర్పర్సన్ అభ్యర్థి హైమావతి బీసీ కాలనీలో ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ఆర్సిపి వాహనశ్రేణిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో జమ్మలమడుగులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
వాహనాల ధ్వంసం ఘటనను నిరసిస్తూ జమ్మలమడుగు పాత బస్టాండ్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ, మున్సిపల్ వైకాపా ఛైర్పర్సన్ అభ్యర్థి హైమావతి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పాత బస్టాండ్ లోని గాంధీ కూడలిలో సుమారు గంటసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీస్ స్టేషన్ నుంచి పాత బస్టాండ్కు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ సతీమణి ఇందిరమ్మ మీడియాతో మాట్లాడుతూ..
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న జమ్మలమడుగును 1982 సంవత్సర నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా వారిద్దరు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము మాత్రం అందరం బాగుండాలని కోరుకుంటే వారు మాత్రం అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ప్రజలను ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని త్వరలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ వైకాపా చైర్పర్సన్ అభ్యర్థి హైమవతి మాట్లాడుతూ కడప నుంచి సిఆర్పిఎఫ్ బలగాలను జమ్మలమడుగుకు రప్పించి ఎన్నికలను సజావుగా జరపాలని డిమాండ్ చేశారు..




