Rayachoti: రాయచోటిలో భూమి హక్కు పత్రాల పంపిణీ!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిగువ అబ్బవరం సచివాలయంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ పంపిణీ చేశారు.
Rayachoti: రాయచోటిలో భూమి హక్కు పత్రాల పంపిణీ!
Rayachoti: రాయచోటి మండలం దిగువ అబ్బవరం స్వర్ణ గ్రామ సచివాలయంలో పట్టాదారు పాసుబుక్కులను రాయచోటి రూరల్ టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ పంపిణీ చేయడం జరిగింది. గండికోట సుధాకర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే భూ తప్పిదాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులకు గురయ్యారని, అందువల్ల మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మళ్లీ రీ సర్వే చేయించి ఎటువంటి భూ ఆక్రమణ లకు తావివ్వకుండా మళ్లీ పట్టాదారు పాస్ బుక్కులను ముద్రించి ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ పట్టాదారు పాస్ బుక్కులను తీసుకున్న ఇందుకూరుపల్లె గ్రామ ప్రజలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రం సుబ్బయ్య నాయుడు, ఆంజనేయులు నాయుడు, శ్రీనివాసులు నాయుడు, స్వామి కొండ మరియు గ్రామ రెవిన్యూ అధికారి అమీర్ భాష, సర్వేయర్ భవ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




