Proddatur: కోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం గౌరవిస్తుంది!
Proddatur: ప్రొద్దుటూరులో ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు.
Proddatur: కోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం గౌరవిస్తుంది!
Proddatur: ప్రొద్దుటూరులో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన భాగంగా ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి.. అనంతరం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
కోర్టు తీర్పులను కూటమి పార్టీలు గౌరవిస్తాయని, ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటానికి బీసీలే ప్రధాన కారణమని, బీసీల రుణం తీర్చుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ హయాంలో వందలాది మంది బీసీలపై దాడులు జరిగాయని ఆరోపించారు. వైసీపీలోని బీసీలు ఈ ఘటనలను మర్చిపోయినా, రాష్ట్రంలోని బీసీలకు ఇంకా గుర్తున్నాయని వ్యాఖ్యానించారు.
బీసీల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి, ప్రొద్దుటూరులో బీసీ నేత నందం సుబ్బయ్య హత్యకు వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి సిద్ధంగా ఉందని, ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.




