Kadapa: డీఎస్సీని రద్దు చేయాలని వైసీపీ కుట్ర పన్నుతోంది శ్రీనివాస రెడ్డి

Kadapa:

C.SATHYAMAYYA, KADAPA
Published on: 9 Aug 2026 3:24 PM IST
Kadapa
X

Kadapa: డీఎస్సీని రద్దు చేయాలని వైసీపీ కుట్ర పన్నుతోంది శ్రీనివాస రెడ్డి

Kadapa: నగరంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం జరిగినా వైసీపీ గొడ్డలి పార్టీ తన ఉనికి కోసం బురద చల్లుతోంది.డీఎస్సీ అనేది ఆన్లైన్ లో జరిగింది అనే విషయంపైనా కూడా మీకు అవగాహన లేదు.7 సార్లు డీ.ఎస్.సి నిర్వహించిన ఘనత చంద్రబాబునాయుడు గారిదే.

ఇంటర్వ్యూ విధానం కూడా రద్దు చేసి డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాడు.రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 75% మంది చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో ఉద్యోగాలు పొందినవారే,మొన్న జరిగిన డీఎస్సీలో 16,000 మంది ఉద్యోగాలు పొందితే వైసీపీకి కడుపు మండి ఎలాగైనా క్యాన్సిల్ చేపించాలని కుట్ర పన్నుతుంది.

కరోనా సమయంలో మద్యం దుకాణాల్లో ఉపాధ్యాయులతో బ్రాందీని అమ్మించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే,వైసీపీ చేస్తున్న ధర్నాలలో రాజకీయ నాయకులను కూర్చోబెట్టుకొని డీఎస్సీ రద్దు కోసం కుట్రపన్నుతున్నారు.ధర్నాలలో ఉపాధ్యాయ పోస్టులు రాని వారు కనీసం ఒక్కరు కూడా లేరు.

మా సమర్థతతోనే డీఎస్సీలో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు గర్వంగా ఉద్యోగాలు పొందామని కర్నూల్ లో కొండారెడ్డి బురుజుకి ఎక్కి చెప్పారు.ఇలా డిఎస్సి పై కుట్రలు చేస్తే ఉపాధ్యాయులంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి నివాసం పైకి కూడా ఎక్కగలరు,చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వబోతున్నారని తెలిపారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story