Badvel: పాత రేకలకుంటలో కూటమి అభ్యర్థుల ప్రచారం!
Badvel: పాత రేకలకుంటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ప్రచారం నిర్వహించారు.
Badvel: పాత రేకలకుంటలో కూటమి అభ్యర్థుల ప్రచారం!
Badvel: బద్వేల్ నియోజకవర్గం, గోపవరం మండలం, పాత రేకలకుంట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ZPTC అభ్యర్థి దాసరి చిన్నమ్మ గారు, MPTC అభ్యర్థి నందలూరి శ్రావంతి గారి విజయమే లక్ష్యంగా ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి, కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాత రేకలకుంట గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు దాసరి చిన్నమ్మ,నందలూరి శ్రావంతి గార్లకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఘనవిజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.




