Rayachoti: బీసీల ఎదుగుదలకు టీడీపీయే పునాది
Rayachoti: బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచి రాజకీయ ఎదుగుదలకు టీడీపీ పునాది వేసిందని మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తెలిపారు.
Rayachoti: బీసీల ఎదుగుదలకు టీడీపీయే పునాది
రాయచోటి: రాయచోటి లోని మండిపల్లి భవన్ లో టిడిపి మండల అధ్యక్షులు గండికోట సుధాకర్, సంబేపల్లి మండల క్లస్టర్ ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడుతూ 1987 లో శ్రీ నందమూరి తారకరామారావు గారు స్థానిక సంస్థలలో20 శాతము రిజర్వేషన్లు కల్పించి, గ్రామస్థాయి నుంచి బీసీ నాయకత్వం ఎదిగేందుకు పునాది వేశారని, తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తదనంతరం వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇదే రిజర్వేషన్లను కొనసాగించాయని, అయితే గత వైసిపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వలన బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం కలిగిందని తెలిపారు.
రాజకీయంగా రిజర్వేషన్లను కల్పించడమే కాకుండా బీసీ వృత్తుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 33% కేటాయింపు, గీత కార్మికులకు ఎక్సైజ్ దుకాణాలలో 10 శాతం కేటాయింపు, నేతన్నలకు చేయూత, ఉచిత విద్యుత్ పథకాలు, మత్స్యకారులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సెలూన్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దేవాలయాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు జీతం 25000 వేల రూపాయలకు పెంచి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని అన్నారు. బీసీల రాజకీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి తమ కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెన్న కృష్ణారెడ్డి పాల్గొన్నారు..




