Punganur: పుంగనూరులో టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు ప్రజా దర్బార్!

Punganur: పుంగనూరు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

MAHESH, PUNGANOOR
Published on: 25 Sept 2026 6:33 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు ప్రజా దర్బార్!

పుంగనూరు: పుంగనూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.

ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్జీపై స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్, సోమల సురేష్, పుంగనూరు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్,మధు రాయల్, కుమార్ ,ఆసూరి బాలాజీ, సుబ్రహ్మణ్యం రాజు, రామకృష్ణరాజు, ఖలీల్, ఆఫ్రోజ్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR