Proddatur: రాచమల్లు నోరు అదుపులో పెట్టుకోవాలి: నాగరాజు!

Proddatur: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు టీడీపీ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 22 Oct 2026 5:07 PM IST
Proddatur
X

Proddatur: రాచమల్లు నోరు అదుపులో పెట్టుకోవాలి: నాగరాజు!

Proddatur: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన విమర్శలపై వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన టిడిపి రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ నల్లబోతుల్లా నాగరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని నాగరాజు హెచ్చరించారు.

సభ్య సమాజం తలదించుకునేలా, అభ్యంతరకర రీతిలో మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలోనే అబద్ధాలు ఆడటంలో రాచమల్లు ప్రథమ స్థానంలో ఉంటారని నాగరాజు ఘాటుగా విమర్శించారు. గతంలో రాచమల్లు సాగించిన దౌర్జన్యాలను, ఆక్రమణలను ప్రొద్దుటూరు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని గుర్తుచేశారు. ఇకనైనా నోరు అదుపు తప్పి మాట్లాడితే ప్రొద్దుటూరు ప్రజలు, టిడిపి శ్రేణులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని నాగరాజు తీవ్రంగా హెచ్చరించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR