Proddatur: టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి: వీడిన ఉత్కంఠ!

Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి పేరు ఖరారు కావడంతో రాజకీయాల్లో కొత్త జోష్ వచ్చింది.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 Oct 2026 5:55 PM IST
Proddatur
X

Proddatur: టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి: వీడిన ఉత్కంఠ!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. ఎన్నో ఊహాగానాలు, ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి వైపు మొగ్గు చూపడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు ఇరువర్గాలు పావులు కదుపుతుండటంతో రాబోయే పోరు అత్యంత ఆసక్తికరంగా మారనుంది.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై గత కొద్ది రోజులుగా టీడీపీ క్యాడర్‌లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. పార్టీ టికెట్ లేదా చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై రకరకాల చర్చలు జరిగాయి.

అయితే, అన్ని ఊహాగామాలకు చెక్ పెడుతూ పార్టీ హైకమాండ్ మరియు స్థానిక నాయకత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోదరుడైన నంద్యాల రాఘవరెడ్డి పేరును చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం వెలువడడంతో స్థానిక రాజకీయాల్లో జోష్ నిండింది.

నంద్యాల కుటుంబానికి ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఉన్న పట్టు, కేడర్‌తో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో, ప్రొద్దుటూరులో చైర్మన్ పీఠం దక్కించుకోవడంపై రాజకీయ పోరు రసవత్తరంగా మారింది.

నంద్యాల రాఘవరెడ్డి పేరు ఖరారు కావడంతో ప్రొద్దుటూరులోని టీడీపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR