Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టీడీపీ సంచలన క్లీన్ స్వీప్ విజయం!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సంచలన విజయం. 52 వార్డులు ఏకగ్రీవం, క్లీన్ స్వీప్ నమోదు. చైర్మన్‌గా ఎన్నికైన నంద్యాల రాఘవరెడ్డి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 Oct 2026 5:31 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టీడీపీ సంచలన క్లీన్ స్వీప్ విజయం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం సాధించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని టిడిపి పూర్తిగా తన వశం చేసుకుంటూ 'క్లీన్ స్వీప్' నమోదు చేసింది. మొత్తం 52 మున్సిపల్ వార్డులలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి 52 మంది కౌన్సిలర్లు తమ ఎన్నికల డిక్లరేషన్ పత్రాలను అందుకున్నారు.

​ఇక ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆయన అధికారికంగా డిక్లరేషన్ స్వీకరించారు.

​ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, నంద్యాల రవీంద్రారెడ్డి, నంద్యాల హరినాథ్ రెడ్డి లతో పాటు పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కొత్తగా ఎన్నికైన చైర్మన్ మరియు కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR