Rayachoti: రాయచోటి రాయుడు కాలనీ వద్ద క్షుద్ర పూజల కలకలం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి శివార్లలోని రాయుడు కాలనీ సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ధన త్రయోదశి రాత్రి పూజల ఆనవాళ్లు లభించడంతో నివాసితుల్లో తీవ్ర భయాందోళనలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Nov 2026 12:29 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి రాయుడు కాలనీ వద్ద క్షుద్ర పూజల కలకలం!

Rayachoti: అన్నమయ్య జిల్లా, రాయచోటి శివార్లలోని రాయుడు కాలనీ వద్ద క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా కనిపించే ఆనవాళ్లు బయటపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న రాత్రి ధన త్రయోదశి సందర్భంగా మదనపల్లి రోడ్డు నుంచి కూత వేటు దూరంలో, రాయుడు కాలనీకి అతి సమీపంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు.

అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు,కొబ్బరి చిప్పలు, బొరుగులు, బియ్యంతో కూడిన అక్షింతలు, ఆకులు, పూలు, మనిషి ఆకారంలో వేసిన ముగ్గు, ఒక మహిళకు చెందిన వస్త్రాలు కనిపించాయి. దీంతో ఎవరో గిట్టని వారు ఆ మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ పూజలు చేశారా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ క్షుద్ర పూజలో భాగంగా అదే ప్రాంతంలో నేలపై ఒక కత్తి కూడా కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి, ఇలాంటి మూఢ నమ్మకాలతో ప్రజలను భయపెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI