Sundupalli: డీజే వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
Sundupalli: సుండుపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డీజే వాహనం ఢీకొని రిజ్వాన్ అనే యువకుడికి తీవ్ర గాయాలు. రాయచోటి ఆసుపత్రికి తరలింపు.
Sundupalli: డీజే వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
సుండుపల్లి: సుండుపల్లి మండలంలోని జీకే రాచపల్లి హాస్టల్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రిజ్వాన్‌ను డీజే వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
జీకే రాచపల్లికి చెందిన రిజ్వాన్ వ్యక్తిగత పనిమీద సుండుపల్లికి వస్తుండగా సుండుపల్లి నుంచి రాయవరం వైపు వెళ్తున్న డీజే వాహనం అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ప్రమాదంలో రిజ్వాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అనంతరం 108 సిబ్బంది రిజ్వాన్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




