Rayachoti: శ్రీ కాశీనాయన ఆశ్రమంలో సుగవాసి సాయి మిథిల్ జన్మదిన వేడుకలు!

Rayachoti: రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు కుమారుడు సాయి మిథిల్ జన్మదిన వేడుకల్లో భాగంగా మాధవరం శ్రీ కాశీనాయన ఆశ్రమంలో పంపిణీ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Sept 2026 2:24 PM IST
Rayachoti
X

Rayachoti: శ్రీ కాశీనాయన ఆశ్రమంలో సుగవాసి సాయి మిథిల్ జన్మదిన వేడుకలు!

Rayachoti: రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి పెద్ద కుమారుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ కీర్తిశేషులు శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారి ముద్దుల మనవడు శ్రీ సుగవాసి సాయి మిథిల్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాధవరం పరిధిలోని శ్రీ కాశీనాయన ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

రాజంపేట పార్లమెంట్ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ పుత్తా రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాదంతో పాటు పండ్లు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

జన్మదిన వేడుకలను కేవలం ఆనందోత్సవాలకే పరిమితం చేయకుండా, అభాగ్యులకు, వృద్ధులకు సేవ చేయడం ద్వారా సార్థకం చేయాలనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం.

అన్నదానం, సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని చాటిచెప్పే గొప్ప మార్గాలు. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడం, వారి ఆశీర్వాదాలు పొందడం ఎంతో సంతృప్తినిచ్చే విషయం.

ఈ కార్యక్రమంలో మన ఊరికోసం సేవ సంస్థ చైర్మన్ శ్రీ అవ్వారు రవిశంకర్, ఆశ్రమ నిర్వాహకులు శ్రీ మేరువ బాలాజీ, మాజీ వార్డు సభ్యులు శ్రీ సామల చెంగయ్య, సిద్దవటం మాజీ టీడీపీ యూనిట్ ఇన్‌చార్జి శ్రీ పుత్తా శివానంద, నియోజకవర్గ ఐటీడీపీ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ నాగమునయ్య తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI