Rayachoti: రాయచోటిలో ఘనంగా వినాయకుని నిమజ్జన కార్యక్రమం!
Rayachoti: రాయచోటిలో ఘనంగా వినాయక నిమజ్జనం మరియు ప్రత్యేక పూజలు.. పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు.
Rayachoti: రాయచోటిలో ఘనంగా వినాయకుని నిమజ్జన కార్యక్రమం!
Rayachoti: రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని సాయి హాల్ వెనుక భాగంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ, భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.
వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రసాద్ బాబు గారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.




