Jammalamadugu: జమ్మలమడుగులో యువనేత సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Jammalamadugu: జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అన్నా క్యాంటీన్ వద్ద 1,400 మందికి అన్నదానం, పాత బస్టాండ్ వద్ద కేక్ కటింగ్.
Jammalamadugu: జమ్మలమడుగులో యువనేత సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Jammalamadugu: కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో యువనేత సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి కుమారుడైన సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కూటమి నాయకులు ఉప్పలపాడు శ్రీనివాసుల రెడ్డి, మునేష్, మహేంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్‌లో సుమారు 1,400 మంది ప్రజలకు అన్నదానం చేశారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ.. యువనేత సుధీర్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




