Madanapalle: హనుమంతుడి శోభాయాత్రలో ఆకర్షణగా నిలిచిన శ్రీరామ్ చినబాబు
Madanapalle: మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొని, భక్తులతో కలిసి సందడి చేశారు.
Madanapalle: హనుమంతుడి శోభాయాత్రలో ఆకర్షణగా నిలిచిన శ్రీరామ్ చినబాబు
మదనపల్లి: పట్టణంలో ఘనంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ర్యాలీ ప్రారంభం నుంచి ముగింపు వరకు పాల్గొన్న ఆయన, హిందూ బంధువులతో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగారు. ర్యాలీ సందర్భంగా పలుచోట్ల శ్రీరామ్ చినబాబు చేసిన నృత్యం, జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొన్న వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. పట్టణ వీధులన్నీ భక్తి భావంతో మార్మోగగా, పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం మతసామరస్యం, భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
Next Story




