Duvvuru: అన్నపూర్ణాదేవి అలంకారంలో దువ్వూరు కన్యకాపరమేశ్వరి అమ్మవారు

Duvvuru: దువ్వూరు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 12 Oct 2026 7:47 PM IST
Duvvuru
X

Duvvuru: అన్నపూర్ణాదేవి అలంకారంలో దువ్వూరు కన్యకాపరమేశ్వరి అమ్మవారు

​దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం నాడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

​ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రభాత సేవ, జపాలు, చండీ పారాయణం, మహానివేదన మరియు మహామంగళహారతి శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి నిర్వహించారు. దువ్వూరుతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

​ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు తీర్థప్రసాదాలు అందజేసినట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు తెలిపారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR