Kadapa: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు. 114 దుంగలు స్వాధీనం!

Kadapa: కడప జిల్లావ్యాప్తంగా అటవీశాఖ దాడుల్లో 114 ఎర్రచందనం దుంగలు, 7 వాహనాలను సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎఫ్ఓ బాలరాజు తెలిపారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 27 Nov 2026 12:22 PM IST
Kadapa
X

Kadapa: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు. 114 దుంగలు స్వాధీనం!

Kadapa: రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ చింతా మోహన్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ సవరణ ప్రయత్నాలపై కడప నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హెచ్చరిక జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన చంద్రబాబు నేడు బీజేపీకి తొత్తుగా మారారని విమర్శించారు. కడప ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎదిగేలా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. బియ్యం, పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెట్టడం దారుణమన్నారు.

రైతులు, పేదలకు బ్యాంకు రుణాలు అందని పరిస్థితి నెలకొందని, మరోవైపు కార్పొరేట్ సంస్థలకు 16.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని ఆరోపించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో 150 లక్షల కోట్ల రూపాయల విదేశీ అప్పులు చేశారని పేర్కొన్నారు. ఇంత భారీగా అప్పులు తీసుకొచ్చి ఏం చేశారో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ అప్పులు, వాటి వినియోగంపై కేంద్రం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని చింతా మోహన్ కోరారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA