Proddatur: ప్రొద్దుటూరు మండలం పెన్నా నగర్ 4వ వార్డు ఎంపీటీసీగా షేక్ ఆశ ఏకగ్రీవ ఎన్నిక!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పెన్నా నగర్ 4వ వార్డు ఎంపీటీసీగా షేక్ ఆశ ఏకగ్రీవం. టీడీపీ నాయకుడు నంద్యాల కొండారెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎంపీటీసీ.

P. GURUSWAMI, PRODDUTUR
Updated on: 28 Oct 2026 11:20 AM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మండలం పెన్నా నగర్ 4వ వార్డు ఎంపీటీసీగా షేక్ ఆశ ఏకగ్రీవ ఎన్నిక!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రొద్దుటూరు మండలం మొత్తం 24 ఎంపీటీసీ లు గాను 23 ఎంపీటీసీలు ఏకగ్రీవాలు. ​ఇందులో భాగంగా సోములవారిపల్లె పెన్నా నగర్ ఎంపీటీసీ 4 వార్డ్ షేక్ ఆశ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి ఆమె తన ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు.

నేడు కామానూరు స్వగ్రామం లో టిడిపి నాయకులు నంద్యాల కొండారెడ్డి ని ఆమె కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ​ఈ సందర్బంగా షేక్ ఆశ ఆమె భర్త షేక్ షఫీ, వారి మిత్రులు షరీఫ్ కొండారెడ్డి ని శాలువా తో సత్కరించి, తన ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.. షేక్ ఆశ మాట్లాడుతూ నాకు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ రాఘవరెడ్డి, టిడిపి నాయకులు నంద్యాల కొండారెడ్డి, తదితర నాయకులకు అందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR