Proddatur: జర్నలిస్ట్ షేక్ మహమ్మద్ రఫీకి జాతీయ పురస్కారం 2026!

Proddatur: ప్రొద్దుటూరు సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహమ్మద్ రఫీకి ఎం.వి. రావు జాతీయ పురస్కారం లభించింది. నెల్లూరులో ఏఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా అందుకున్నారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 30 Oct 2026 11:43 AM IST
Proddatur
X

Proddatur: జర్నలిస్ట్ షేక్ మహమ్మద్ రఫీకి జాతీయ పురస్కారం 2026!

Proddatur: ప్రొద్దుటూరు చెందిన సీనియర్ జర్నలిస్టు షేక్ మహమ్మద్ రఫీకి ఎం.వి. రావు ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక 'జర్నలిస్టు జాతీయ పురస్కారం – 2026' లభించింది. నెల్లూరులోని విజయకుమార్ ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ​నెల్లూరు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమెంటో, ప్రముఖ సినీ రచయిత ఎస్.వి. స్వామినాయుడు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, ఫౌండేషన్ ఛైర్మన్ ఎం. లీలా మోహన్ కృష్ణ చేతుల మీదుగా మెడల్‌ను మహమ్మద్ రఫీ స్వీకరించారు.

జర్నలిజం రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలకు గాను ఈ జాతీయ పురస్కారం లభించడంతో ప్రొద్దుటూరు పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రఫీకి లభించిన ఈ గౌరవం పట్ల పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR