Kadapa: మైదుకూరులో ఈనెల 27న రైతు సదస్సు!

Kadapa: కడప జిల్లా మైదుకూరులో ఈనెల 27న సాగునీటి ప్రాజెక్టులపై రైతు సదస్సు. రాజోలి, జోలదరాశి ప్రాజెక్టుల పూర్తికోసం సదస్సును జయప్రదం చేయాలని పిలుపు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 22 Sept 2026 12:30 PM IST
Kadapa
X

Kadapa: మైదుకూరులో ఈనెల 27న రైతు సదస్సు!

Kadapa: కడప జిల్లా రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ మైదుకూరు పట్టణం లోని మేధా డిఫెన్స్ అకాడమీ లో కడప జిల్లాలో సాగునీటి వనరులు, పెండింగ్ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అనే అంశంపై జరిగే రైతు సదస్సులో రైతులు, ప్రజాసంఘాలు, రైతు శ్రేయోభిలాషులు భాగస్వాము లై జయప్రదం చేయాలని ఈరోజు మైదుకూరు పట్టణంలో రైతు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ, రైతు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కోరారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రమణ మాట్లాడుతూ కడప జిల్లా నుండి వందల టీఎంసీల నీళ్లు కుందు, పెన్నానది ద్వారా సోమశిల, చెన్నైలకు వెళుతున్న కడప జిల్లాలో ఉన్న కేసీ కెనాల్, తెలుగు గంగఆయకట్టు రైతులకు శ్రీశైలం నీటి మీదనే ఆధారపడి పంటలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి నుండి పై రెండు ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కుందునదిపై రాజోలి, జోలదరాశి పేరుతో ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నించి శంకుస్థాపన కూడా చేసి నిధులు కేటాయించడం జరిగింది.

దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు మరణించడంతో ఆ తర్వాత రాష్ట్ర ముఖ్య మంత్రులుగా వచ్చి పాలించిన, పాలిస్తున్న వారు ప్రాజెక్టులపై స్పందించకపోవడంతో పై రెండు ప్రాజెక్టుల పనులు ఎక్కడికి ఆక్కడ నిలిచిపోయినాయి . ఈ సంవత్సరం ఏలీనవో ప్రభావంతో కడప జిల్లా రైతులకు రాజోలి,జోలద రాశి ప్రాజెక్టుల ఆవశ్యకత ఎంతో అర్థం అవుతుంది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పై రెండు ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరతిగ తినపూర్తిచేయాలని రైతు సేవా సమితి ఈనెల 1వ తేదీ నుండి రైతు గ్రామబాట పేరిట మండలాల వారిగా గ్రామాల వారీగా తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తూ మండల రెవెన్యూ కార్యాలయములలో తాసిల్దార్ లకు వినతి పత్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది చివరగా ఈ నెల 27వ తేదీ రైతు సదస్సును నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని కావున ఈ రైతు సదస్సుకు ముఖ్య వక్తలుగా రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామీ రెడ్డి, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు హైకోర్టు లాయర్ రామ్ కుమార్ గారు హాజరవుతున్నారు.

కావునరైతులు, రైతు శ్రేయోభిలాషులు, భాగస్వాము లై రైతు సదస్సునుజయప్రదం చేయాలని రమణ కోరారు. ఈరోజు జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ నేత రైతురిటైర్డ్ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి గారు, రైతు సేవా సమితి మైదుకూరు పట్టణ, మండల నాయకులు రామ్మోహన్, చెక్పోస్ట్ శ్రీనివాసులు, తిరువాయి పాటీ నరసింహులు, ప్రజా సంఘాల నాయకులు సమరతశ సుబ్రహ్మణ్యం, ఎమ్మార్పీఎస్ నాయకులు మిద్దె వెంకటరమణ, హరిబాబు మాజీ సర్పంచ్ ఎల్లంపల్లి సుబ్బారెడ్డి, పప్పనపల్లి నారాయణరెడ్డి, రాజాల రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR