Duvvuru: గ్రామాల అభివృద్ధే కూటమి లక్ష్యం: మనోహర్ రెడ్డి
Duvvuru: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం నీలాపురం ఎంపీటీసీ కూటమి బీజేపీ అభ్యర్థి అమ్మిరెడ్డి మనోహర్ రెడ్డికి మద్దతుగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Duvvuru: గ్రామాల అభివృద్ధే కూటమి లక్ష్యం: మనోహర్ రెడ్డి
దువ్వూరు: గ్రామాల అభివృద్ధి కూటమి సర్కారుతోనే సాధ్యమని నీలాపురం ఎంపీటీసీ అభ్యర్థి అమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అరవేటి హరికృష్ణ లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నీలాపురం ఎంపీటీసీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచి పోటీ చేస్తున్న వ్యక్తి మనోహర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం నీలాపురం గ్రామంలో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు వస్తున్నాయని ఆ నిధులతో గ్రామాలు అభివృద్ధి వైపు సాగుతున్నాయన్నారు. ఎంపిటిసి అభ్యర్థిగా వారి మెజార్టీతో గెలిపిస్తే గ్రామాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.
వారి వెంట భారతీయ జనతపార్టీ మాజీ మండల అధ్యక్షులు అమ్మిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, బ్రహ్మంగారి మఠం బీజేపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబులరెడ్డి, దువ్వూరు బీజేపీ అధ్యక్షులు పల్లె సుబ్బారెడ్డి, కాజీపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, చాపాడు మండల అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి, మాజీ మండలఅధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రకాంతం ఈశ్వరయ్య, బీజేపీ నాయకులు గుర్రప్ప, మనోహర్, మురళి, బాలనాగిరెడ్డి, చంద్ర, రామ మునిరెడ్డి, రంగనాధ్, వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




