Kadapa: ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యత ముఖ్యం: కలెక్టర్

Kadapa: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని కడప కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 12 Oct 2026 4:55 PM IST
Kadapa
X

Kadapa: ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యత ముఖ్యం: కలెక్టర్

Kadapa: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి అర్జీపై ప్రత్యేక శ్రద్ధ చూపి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. అదే సమయంలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

కడప కలెక్టరేట్ సభాభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ డాక్టర్ నిధీ మీనాతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు అలసత్వం వీడి ప్రతి ఫిర్యాదును నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. భూ సంబంధిత సమస్యలకు రెవెన్యూ క్లినిక్‌ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు.

అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొంతనలేని నివేదికలు సమర్పించవద్దని స్పష్టం చేశారు.

మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను ముందుగానే గుర్తించి, సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA