Veeraballi: కడప జిల్లా వీరబల్లిలో రూ.19.10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం!

Veeraballi: కడప జిల్లా వీరబల్లి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల మెరుపు దాడి. రూ.19.10 లక్షల విలువైన దుంగలు, కారు స్వాధీనం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Sept 2026 4:18 PM IST
Veeraballi
X

Veeraballi: కడప జిల్లా వీరబల్లిలో రూ.19.10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం!

Veeraballi: కడప జిల్లా వీరబల్లి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎస్సై సుస్మిత ఉక్కు పాదం మోపుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిన సమాచారం మేరకు మెరుపు దాడులు నిర్వహించి సీతంపేట ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు 19 లక్షల 10 వేల రూపాయలు ఉంటుందని వీటి బరువు 382 కేజీలు అని సీఐ సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు స్మగ్లర్ల తో పాటు ఒక కారు మరియు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సి ఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్మగ్లర్ లను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ సుస్మిత మరియు సిబ్బందిని సిఐ ప్రత్యేకంగా అభినందించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI