Rayachoty: రాయచోటిలో స్థానిక ఎన్నికల నామినేషన్లపై సీఐ హెచ్చరిక!
Rayachoty: రాయచోటిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల వేళ 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని అర్బన్ సీఐ బి.వి. చలపతి హెచ్చరిక.
Rayachoty: రాయచోటిలో స్థానిక ఎన్నికల నామినేషన్లపై సీఐ హెచ్చరిక!
రాయచోటి: రాయచోటి మండల ప్రజలకు రాయచోటి అర్బన్ పోలీసుల విజ్ఞప్తి ఏమనగా, 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ 21.10.2026 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, నామినేషన్ కేంద్రంగా ఉన్న రాయచోటి ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో పోలీసులు నిర్దేశించిన భద్రతా నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.
144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున నిబంధనలు పాటించాలి. రాయచోటి పట్టణం, మండల పరిధిలో సంబంధిత అధికారులు అమలులోకి తెచ్చిన నిషేధాజ్ఞలు, పోలీస్ యాక్ట్ నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. వర్తించే నిషేధాజ్ఞల ప్రకారం నిషేధిత గుమిగూడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు, చట్టవిరుద్ధమైన సమావేశాలు నిర్వహించడం నిషిద్ధం. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద వర్తించే ఆదేశాల ప్రకారం ముందస్తు అనుమతి అవసరమైన ఊరేగింపులు, సభలు, ర్యాలీలు, ధర్నాలు లేదా ఇతర కార్యక్రమాలను సంబంధిత అధికారుల అనుమతి లేకుండా నిర్వహించరాదు.
గత ఘటనలపై కేసులు నమోదు:
గతంలో రాయచోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో ఎవరైనా గొడవలు సృష్టించినా, దాడులకు పాల్పడినా, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, సంబంధిత చట్టాలు మరియు ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




