Rayachoty: రాయచోటి: మౌర్య రెడ్డికి ఆలయ అర్చకుల వేదాశీర్వచనం!

Rayachoty: మంత్రి మండిపల్లి మేనల్లుడు మౌర్య రెడ్డి పుట్టినరోజున రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కుటుంబసభ్యులు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Oct 2026 12:28 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటి: మౌర్య రెడ్డికి ఆలయ అర్చకుల వేదాశీర్వచనం!

Rayachoty: మౌర్య రెడ్డి గారి జన్మదినం సందర్భంగా శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు, యువ నాయకుడు శ్రీ మౌర్య రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న శ్రీ మౌర్య రెడ్డి గారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో రమణారెడ్డి, ఆలయ చైర్మన్ మనోజ్, బోర్డు మెంబర్స్ శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో మౌర్య రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI