Rayachoti: రాయచోటిలో గణనాథునికి శ్రీకాంత్ రెడ్డి పూజలు!

Rayachoti: పాత రాయచోటిలో కొలువుదీరిన గణనాథునికి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Updated on: 23 Sept 2026 4:37 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో గణనాథునికి శ్రీకాంత్ రెడ్డి పూజలు!

Rayachoti: పాత రాయచోటిలో కొలువుదీరిన గణనాథుడికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత రాయచోటికి చేరుకున్న శ్రీకాంత్‌రెడ్డికి స్థానిక ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకాంత్‌రెడ్డి చేత గణనాథునికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.

అనంతరం కీ.శే. మీనుగ భాస్కరయ్య, కీ.శే. సాకే శివ ప్రసాద్ ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించి, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగించి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, మాజీ కౌన్సిలర్ గువ్వల లక్ష్మిదేవి, వైఎస్సార్‌సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రియాజుర్ రెహమాన్, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్, నాయకులు గోపాల్‌రెడ్డి, కొత్తిమీర ప్రసాద్, రాయచోటి అశోక్, గువ్వల జగదీష్, నాగసుబ్బయ్య, రెడ్డి ఆంజనేయులు, రఘు, సురేష్‌కుమార్,శంఖు,ఋషి, సందీప్, పండు,రెడ్డి, సుమంత్, మహేష్ ,సన్నీ తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI