Rayachoti: రాయచోటి వీరభద్ర స్వామి దసరా ఉత్సవాలకు మంత్రి మండిపల్లికి ఆహ్వానం!
Rayachoti: రాయచోటి వీరభద్ర స్వామి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ ఆహ్వానం అందించారు.
Rayachoti: రాయచోటి వీరభద్ర స్వామి దసరా ఉత్సవాలకు మంత్రి మండిపల్లికి ఆహ్వానం!
రాయచోటి: రాయచోటి పట్టణంలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి దసరా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ దేవస్థానం చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ మరియు దేవస్థానం ఈ వో డి.వి రమణారెడ్డి,కమిటీ సభ్యులతో కలిసి రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.




