Rayachoti: రాయచోటి మున్సిపాలిటీలో తొలిసారిగా వైశ్యులకు కౌన్సిలర్ అవకాశం!

Rayachoti: రాయచోటి మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా వైశ్య సామాజిక వర్గానికి కౌన్సిలర్‌గా అవకాశం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రాహుల్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Oct 2026 7:07 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి మున్సిపాలిటీలో తొలిసారిగా వైశ్యులకు కౌన్సిలర్ అవకాశం!

Rayachoti: రాయచోటి మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి తొలిసారిగా వైశ్య సామాజిక వర్గానికి కౌన్సిలర్‌గా అవకాశం కల్పించిన ఘనత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికే దక్కుతుందని 14వ వార్డు కౌన్సిలర్ మండిపల్లి రాహుల్ రెడ్డి పేర్కొన్నారు. వైశ్య సామాజిక వర్గాన్ని గతంలో కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారని, అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు సముచిత గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.సమాజంలోని వివిధ వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగానే 38వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా గ్రంధి గంగాధర రావుకు అవకాశం లభించిందని మండిపల్లి రాహుల్ రెడ్డి పేర్కొన్నారు.అన్ని సామాజిక వర్గాలకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని మరింత విస్తృతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI