Rayachoti: వైయస్సార్‌సీపీ నేతల విమర్శలపై టీడీపీ మండల అధ్యక్షుడు మండిపాటు
Rayachoti: రాయచోటిలో టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై వైసీపీ విమర్శలను తీవ్రంగా ఖండించారు.
Rayachoti: వైయస్సార్‌సీపీ నేతల విమర్శలపై టీడీపీ మండల అధ్యక్షుడు మండిపాటు
రాయచోటి: రాయచోటి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాయచోటి రూరల్ టిడిపి మండల అధ్యక్షులు గండికోట సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తో వైసీపీ పార్టీలో వణుకు పుట్టిందన్నారు. రాయచోటి నియోజకవర్గం నుండి చలో మదనపల్లెకు మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష జనవాహిని తరలి వెళ్లడం చూసి వైసిపి నాయకులకు మతిభ్రమించిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
లక్ష కోట్ల రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే మామూలు విషయం కాదని, పది జిల్లాల్లో 201 క్లస్టర్లలో అభివృద్ధి ప్రణాళిక అని తెలిపారు. వైసీపీ నాయకులు కరువు వచ్చిందని దాని గురించి సహేతుకంగా మాట్లాడడం లేదని, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారే తప్ప అందులో విషయమే లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత వారికి లేదని,ఎల్ ని నో ప్రభావంతో ప్రపంచమంతా వర్షపాతం తక్కువగా నమోదు అవుతున్నదని తెలిసినా కూడా విమర్శించడం తగదన్నారు.
మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రజలు దుర్భర పరిస్థితులు గడిపారని తల్లి ఒకచోట బిడ్డ ఒకచోట బ్రతకవలసి వచ్చిందని ఆ రోజు తమ పార్టీ వాళ్లు కష్టానికి సహకరించారే గాని మీలాగా నీతి తప్పి ప్రవర్తించి మాట్లాడలేదన్నారు. ప్రపంచంలోని దిగ్గజ దేశాలు, బిల్ గేట్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భావితరాలకు ముందు చూపును చూపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని పొగుడుతుంటే మీరు విమర్శించడం ఎంతవరకు సమంజసం అన్నారు.
ఇలాంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడే కదా ధైర్యంగా ముందుకు నిలబడి, వర్షపాతం తక్కువ గా నమోదైన గాని రాయలసీమను రత్నాలసీమగా చూడాలని సంకల్పంతో నదుల అనుసంధానం చేయాలని పట్టుదలతో పని చేస్తున్న ఉక్కుమనిషి మా చంద్రబాబు నాయుడు గారని కొనియాడారు. వైసీపీ నాయకులు కరువును కూడా రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ బసయ్య, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కోటకొండ రవిశంకర్, పల్లపు మల్ రెడ్డి, ఉదయగిరి మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు.




