Rayachoti: పరిషత్ ఎన్నికల లెక్కింపునకు మూడంచెల భద్రత
Rayachoti: రాయచోటిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌కు మూడంచెల భద్రత, డ్రోన్ల నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ వెల్లడి. ర్యాలీలపై కఠిన నిషేధం.
Rayachoti: పరిషత్ ఎన్నికల లెక్కింపునకు మూడంచెల భద్రత
రాయచోటి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు మూడంచెల భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు తెలిపారు.
రాయచోటి పాత ఎస్పీ కార్యాలయ భవనాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, టౌన్ సీఐ చలపతి, ఎస్బి సీఐ సదాశివయ్య, ఎస్ఐ విష్ణులతో ఆయన భద్రతా సమీక్ష నిర్వహించారు.
కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, పూర్తిగా నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
అభ్యర్థులు, ప్రజలు సంయమనం పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.




