Rayachoti: డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని కలిసిన సీఐ ఉలసయ్య
Rayachoti: రాయచోటి రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఉలసయ్య తెలుగుదేశం పార్టీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Rayachoti: డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని కలిసిన సీఐ ఉలసయ్య
Rayachoti: రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఉలసయ్య గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని రాయచోటి ఎస్‌ఎన్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయడం వంటి అంశాలపై డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు.




