Rayachoti: రూ.35 కోట్ల హెచ్‌ఏఎం అభివృద్ధి పనులకు శ్రీకారం

Rayachoti: రాయచోటిలో రూ.35 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Sept 2026 4:40 PM IST
Rayachoti
X

Rayachoti: రూ.35 కోట్ల హెచ్‌ఏఎం అభివృద్ధి పనులకు శ్రీకారం

రాయచోటి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 106 నియోజకవర్గాలు, 123 మున్సిపాలిటీలలో రూ.11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు.

స్థానిక అజయ్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాయచోటి అభివృద్ధికి రూ.244.32 కోట్లు

ఈ సందర్భంగా వర్చువల్ కార్యక్రమం అనంతరం మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... రాయచోటి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ మేరకు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు నేడు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టడం శుభపరిణామన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన, సురక్షితమైన మౌలిక వసతులు కల్పించాలన్న లక్ష్యంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నారని తెలిపారు.

మంత్రి విజ్ఞప్తి మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పథకాల కింద మొత్తం రూ.244.32 కోట్ల విలువైన పనులకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా సురక్షితమైన తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణ, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణ, నాణ్యమైన రహదారులు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI