Rayachoti: ప్రమాద మృతులకు జడ్పీటీసీ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నివాళి!

Rayachoti: రాయచోటిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పూతల అమరనాథ్ రెడ్డి, పల్లపు శ్రీనివాసులు భౌతిక కాయాలకు జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Nov 2026 3:12 PM IST
Rayachoti
X

Rayachoti: ప్రమాద మృతులకు జడ్పీటీసీ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నివాళి!

రాయచోటి: రాయచోటి ప్రమాదవశాత్తు మృతి చెందిన అమరనాథ్ రెడ్డి, శ్రీనివాసుల భౌతిక కాయానికి జడ్పిటిసి మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు నివాళులు. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పూతల అమరనాథ్ రెడ్డి,పల్లపు శ్రీనివాసులు గార్ల భౌతిక కాయాన్ని జడ్పిటిసి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఊహించని ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, అమరనాథ్ రెడ్డి మృతి వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI