Rayachoti: ఎంపీటీసీగా పోలు రంగారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

Rayachoti: రాయచోటి రూరల్ మాధవరం-1 ఎంపీటీసీగా పోలు రంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం స్వీకరణ. నాయకుల అభినందనలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Oct 2026 4:18 PM IST
Rayachoti
X

Rayachoti: ఎంపీటీసీగా పోలు రంగారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రాయచోటి రూరల్ మండలం మాధవరం-1 ఎంపీటీసీగా పోలు రంగారెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆయనకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన పోలు రంగారెడ్డి గారికి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI