Rayachoti: 12 దొంగిలించబడిన మోటార్ సైకిళ్లను రికవరీ చేసిన పోలీసులు

Rayachoti: రాయచోటిలో బైక్ చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. మైనర్ల నుంచి 12 మోటార్ సైకిళ్లు రికవరీ. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Sept 2026 7:45 PM IST
Rayachoti
X

Rayachoti: 12 దొంగిలించబడిన మోటార్ సైకిళ్లను రికవరీ చేసిన పోలీసులు

రాయచోటి: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల దొంగలించబడ్డ మోటార్ సైకిళ్ల 12 మోటార్ సైకిళ్లు రికవరీ చేసారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన TVS XL మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన మైనర్ బాలురను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.

వారి వద్ద నుండి వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడిన మొత్తం 12 మోటార్ సైకిళ్లను పోలీసులు రికవరీ చేశారు. రికవరీ చేసిన వాహనాలకు సంబంధించి వాటి యజమానులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియ అనంతరం వాహనాలను అప్పగించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.

మైనర్ బాలురు దొంగతనాలకు పాల్పడిన నేపథ్యంలో, వారి విషయంలో జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం మరియు సంబంధిత చట్టాల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కేసులను ఛేదించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రజలకు విజ్ఞప్తి:

ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసి, తప్పనిసరిగా హ్యాండిల్ లాక్/ఇతర భద్రతా పరికరాలను ఉపయోగించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ వెంకట చలపతి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI