Rayachoti: రాయచోటిలో ప్రశాంత వాతావరణం కోసం పోలీసుల భారీ కవాతు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీసుల భారీ కవాతు. ఎన్నికల వేళ ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్సై జహీర్ సూచన.
Rayachoti: రాయచోటిలో ప్రశాంత వాతావరణం కోసం పోలీసుల భారీ కవాతు!
Rayachoti: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు మేరకు రాయచోటిలో ఎస్ఐ ఎస్. జహీర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు ప్రత్యేక బలగాలు చెన్నముక్కపల్లె, నక్కావాండ్లపల్లె, సుండుపల్లి రింగ్ రోడ్డు మీదుగా కవాతు చేపట్టారు. ఎన్నికల వేళ ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే లేదా అనుమానాస్పద చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.




