Rayachoti: చెర్లోపల్లి ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్!
Rayachoti: అన్నమయ్య జిల్లా చెర్లోపల్లి ఎస్సీ కాలనీలో రాయచోటి పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. 50 ఇళ్ల తనిఖీ, 18 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం.
Rayachoti: చెర్లోపల్లి ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్!
Rayachoti: అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాలతో, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ మార్గదర్శ కత్వంలో, వాయల్పాడు సీఐ బి.రాఘవ రెడ్డి పర్యవేక్షణలో గుర్రంకొండ, వాయల్పాడు పోలీసులు సంయుక్తంగా బుధవారం వేకువ జామున చెర్లోపల్లి ఎస్సీ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 50 ఇళ్లను తనిఖీ చేసి, 18 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతియుతంగా జీవించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.




