Rayachoti: కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం

Rayachoti: రాయచోటిలో కులమతాలకు అతీతంగా వినాయక మండపం వద్ద అన్నదానం నిర్వహించిన ముస్లిం సోదరులు. అభినందించిన ఉత్సవ కమిటీ, ప్రముఖులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 21 Sept 2026 9:06 PM IST
Rayachoti
X

Rayachoti: కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం

రాయచోటి: రాయచోటి పాత పోస్ట్ ఆఫీస్ వీధిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం వద్ద టీడీపీ ముస్లిం మైనార్టీ మార్కెట్ కాంట్రాక్టర్ ఇర్షాద్ ఖాన్ గారు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు,మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి గారు,టౌన్ అధ్యక్షుడు బోనమాల ఖాదర్‌వల్లి గారు, దేవేంద్ర రెడ్డి గారు హాజరయ్యారు. అలాగే వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ మనోజ్ గారు, కరంశెట్టి గిరి గారు పాల్గొన్నారు.

ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా ఇర్షాద్ ఖాన్ గారితో పాటు ముస్లిం సోదరులు అప్సర్ గారు, ఖదీర్ ఖాన్ గారు, సలీం గారు, బర్కత్ గారు, పాల్గొని తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అలాగే టీడీపీ నాయకురాలు బల్లాపురం సుజాత గారు, పిన్నంఅశోక్ కుమార్ గారు,కుస్షుమకర్, మరియు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు.

రాయచోటిలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీ సోదరులు ముందుకు వచ్చి *కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం* ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా సోదరభావం, ఐక్యత, సామరస్యాన్ని చాటిచెప్పారు.

ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మైనార్టీ సోదరులను *శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు. కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI