Rayachoti: సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష

Rayachoti: మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లపై రాయచోటిలో మంత్రులు మండిపల్లి, బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష.

RAJESH REDDY, CHINTOOR
Published on: 29 Sept 2026 11:27 PM IST
Rayachoti
X

Rayachoti: సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష

రాయచోటి: అక్టోబర్ 2న మదనపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి పర్యటన నేపథ్యంలో రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

పర్యటనకు సంబంధించి శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలపై మంత్రులు అధికారులతో చర్చించారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, పారిశుధ్యం తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఏర్పాటును క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో సీఎం ప్రోగ్రామ్స్ కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ గారు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య గారితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR