Rayachoti: మంత్రి గారిని ఆహ్వానించిన కృష్ణా యూనివర్సిటీ వీసీ!
Rayachoti: సౌత్ జోన్ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆహ్వానం. తాడేపల్లిలో మంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందించిన కృష్ణా వీసీ రాంజీ.
Rayachoti: మంత్రి గారిని ఆహ్వానించిన కృష్ణా యూనివర్సిటీ వీసీ!
Rayachoti: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కూన రాంజీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 3 నుంచి 7 వరకు విజయవాడలోని నందిగామ కేవీఆర్ కాలేజీలో నిర్వహించనున్న సౌత్ జోన్ మహిళల కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు.




