Rayachoti: ప్రజాసేవే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలి!

Rayachoti: రాయచోటిలో కానిస్టేబుళ్ల పాసింగ్‌ఔట్ పరేడ్ నిర్వహించగా, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాసేవగా విధులు నిర్వహించాలని సూచించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 Sept 2026 12:57 PM IST
Rayachoti
X

Rayachoti: ప్రజాసేవే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలి!

Rayachoti: కళ్యాణ్‌డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC)లో శిక్షణ పూర్తి చేసుకున్న 581 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై* శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగంగా కాకుండా ప్రజాసేవగా భావించి విధులు నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత, మానవత్వంతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించి పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన తరహా నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని మంత్రి తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడంతో పాటు యూనిఫాం గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యాలను విధి నిర్వహణలో సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి అడుగుపెడుతున్న 581 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ విధుల్లో భాగంగా ప్రజలకు భద్రత కల్పిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, PTC ప్రిన్సిపాల్ మహేష్, తిరుపతి జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ, ఐఏఎస్ తదితర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI