Rayachoti: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!
Rayachoti: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు.
Rayachoti: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!
రాయచోటి: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలనే ఉద్దేశంతో చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తన స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను మంత్రివర్యులకు నేరుగా తెలియజేశారు. ప్రజలు అందించిన ప్రతి వినతిని మంత్రి గారు స్వయంగా పరిశీలించి, వారి సమస్యలను ఓపికగా విని, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సమస్యలతో పాటు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు, ప్రజల నుంచి వచ్చే ప్రతి విజ్ఞప్తికి తగిన ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి గారు తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలవడం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పష్టం చేశారు.




