Rayachoti: రాయచోటిలో దసరా విందుకు హాజరైన మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటిలో మేస్త్రి రమణ ఏర్పాటు చేసిన దసరా విందు కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి పాల్గొన్నారు. స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Oct 2026 4:39 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో దసరా విందుకు హాజరైన మంత్రి మండిపల్లి!

రాయచోటి: దసరా పండుగను పురస్కరించుకుని మేస్త్రి రమణ గారు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మౌర్యా రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రివర్యులకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొని, అక్కడి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.

పండుగలు ప్రజల మధ్య సత్సంబంధాలను, పరస్పర గౌరవాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. దసరా పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, అభివృద్ధిని అందించాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI