Rayachoti: జుబేర్ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: రాయచోటి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జుబేర్ భౌతికకాయానికి నివాళులర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కుటుంబానికి పరామర్శ.
Rayachoti: జుబేర్ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: రామాపురం మండలం గువ్వలచెరువుకు చెందిన హోటల్ భాషా చిన్న కుమారుడు జుబేర్ కడప పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తిరుపతి నుంచి గువ్వలచెరువుకు వస్తున్న మార్గమధ్యంలో మోటకట్ల సమీపంలో తన వాహనాన్ని ఆపి, జుబేర్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి తండ్రి గువ్వలచెరువు భాషాను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చిన్న వయసులోనే జుబేర్ మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి మనోధైర్యం కలగాలని మంత్రి ఆకాంక్షించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.




