Rayachoti: రాయచోటి సమగ్ర అభివృద్దే మంత్రి మండిపల్లి లక్ష్యం

Rayachoti: రాయచోటి అభివృద్ధే మంత్రి మండిపల్లి లక్ష్యం. రూ.2వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని రూరల్ టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ వెల్లడి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Sept 2026 6:02 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి సమగ్ర అభివృద్దే మంత్రి మండిపల్లి లక్ష్యం

రాయచోటి: రాయచోటిని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికే సుమారు 2 వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతోందని రాయచోటి రూరల్ టిడిపి మండల అధ్యక్షులు గండికోట సుధాకర్ మీడియా సమావేశం లో పేర్కొన్నారు.

రాయచోటిని అభివృద్ధిలో రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలపాలనే దృఢ సంకల్పంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని కేవలం రెండు సంవత్సరాల్లోనే చేసి చూపించారన్నారు.

రాయచోటి మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. మున్సిపాలిటీలోనైతేనేమి, గ్రామీణ ప్రాంతాలలో నైతేనేమీ ప్రతి వీధికి సిమెంటు రోడ్డులను వెయ్యాలనే దృడ సంకల్పంతోమంజూరు చేయించడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగానే పల్లె పండుగ 3.0 కింద నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లను మంజూరు చేయించారన్నారు. ప్రతి ఇంటికి మంచి నీటిని అందించాలనేదే ఆయన సంకల్పం అన్నారు. రాష్ట్రస్థాయి లో ఏ పథకం వచ్చినా అది రాయచోటి కె కావాలని పరితపించే నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్వలి, ఇమ్రాన్, పీరా తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI